Friday, July 01, 2005

నెల్లూరు నగ రాజారావు

నెల్లూరు నాటక రంగంలో ప్రముఖులుగా కీర్తింపబడేవారిలో 'రంగోద్ధారక ' నగ రాజారావు ప్రధములు. తెలుగు చిత్రం రామదాసులో ' తానీషా ', ద్రౌపది వస్త్రాపహరణంలో ' శకుని ' జలంధరలో 'ఇంద్రుని ' పాత్రలు ధరించి మెప్పించారు. జ్ఞానోదయ నాటక సమాజం వారు ప్రదర్శించిన నాటకాలలో దశరథుడు, రాజరాజు, నందుడు, వీరబాహుడు, కీచకుడు, మొదలైన పాత్రలను అద్భుతంగా పోషించారు. లవకుశ, కృష్ణలీల, సారంగధర, పాదుక, విజయనగర పతనం ఆదిగాగల నాటకాలను ప్రతిభావంతంగా ప్రదర్శించారు. రావుగారికి యుగంధరుడు, పాపారాయుడు, అక్బరు , దుష్టబుద్ధి, నక్షత్రకుడు, శకుని పాత్రలు కీర్తి ప్రతిష్టను ఆర్జించి పెట్టాయి.డి. వి. సుబ్బారావు

తెలుగు నాటక రంగానికి గొప్ప గౌరవ ప్రతిష్ఠలు సమకూర్చి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ నిర్వహించిన మహనీయుడు ' నటరాజు ', ' నటరాజ శేఖరుడు ' దేవరకొండ వెంకట సుబ్బారావు. హైస్కూలు విద్యతో సరిపెట్టి ప్లీడరు గమాస్తా చేశారు. గులేబకావళి, గయోపాఖ్యానం, కృష్ణలీల, లవకుశ, సారంగధర, నా రాజు నాటకాలలో ముఖ్య పాత్రలను పోషించారు. హరిశ్చంద్ర నాటకంలో ఆ పాత్ర డి. వి. సుబ్బారావుకు అసమానమైన కీర్తిని ఆర్జించి పెట్టింది. నాటక రంగ ఆదర్శాలూ, మర్యాదలూ పాటిస్తూ 36 సంవత్సరాలు సమాజాన్ని నిర్వహించిన దిట్ట. పద్యం పాడడంలో రాగం కంటే భావానికి ప్రాధాన్యం ఇచ్చి వాస్తవికమైన సాత్వికాభినయంతో పాడేవారు.కన్నాంబ

కృష్ణంభజే రాధా ' అనే పాట రికార్డుతో ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన కన్నాంబ రంగూన్ రౌడీ, సావిత్రి, అనసూయ, సత్య హరిశ్చంద్ర నాటకాలలో సుప్రసిద్ధ నటులతో నటించి ఉత్తమ రంగస్థల నటీమణిగా కీర్తి గడించారు. 1935 లో హరిశ్చంద్ర చిత్రంలో చంద్రమతిగా నటించి అగ్రశ్రేణీ తారగా పేరు పొందింది. ఇంకా ద్రౌపదీ వస్త్రాపహరణం, చండిక చిత్రాలతో పేరొందిన శ్రీమతి కన్నాంబ భర్త శ్రీ కడారు నాగభూషణం సహాకారంతో రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి (1940 -1964) 30 వరకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు నిర్మించారు. శ్రీమతి కన్నాంబ 150 చిత్రాలలో నటించారు.మంగళంపల్లి బాల మురళీకృష్ణ

మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఒక ఫినామినన్. ఒక సంగీత శిఖరం. ఒక గాన మహాసముద్రం. సంగీతం అంటే ఏమిటో తెలియడానికి వీలులేని వయస్సు నుంచే పాడడం ప్రారంభించి " ఔరా " అని శ్రోతలు ఆశ్చర్య ముగ్ధులయ్యేట్టు చేసి, వయస్సు పెరుగుతున్న కొద్దీ విద్వత్తును పెంచుకుంటూపోయిన మనీషి. పదేళ్ళ వయస్సుకే గొప్ప విద్వాంసుడుగా పేరు పొందాడు. గాత్రం సరే, వీణ, వయోలిన్, వయొలా, మృదంగం, కంజీర - ఇలా ఏ వాద్యమైనా అవలీలగా సాధన చేసి ఒప్పించి, మెప్పించిన ప్రజ్ఞాశాలి. స్వయంగా 72
మేళకర్తలలో కృతులు రచించినవాడు. తెలుగు, కన్నడం, సంస్కృతాలలో కృతులు వ్రాసి కచేరీలలో త్యాగరాజు కీర్తనలతోపాటు గానం చేస్తున్నారు. స్వరకల్పనలో ఆయన దరిజేరగలవారు చాలా కొద్ది మంది ఉంటారు. క్లిష్ట రాగాలను సులభంగా పాడడం, కొత్త రాగాలను సృష్టించడం, కొత్త పోకడలు పోవడం ఆయన ప్రత్యేకత. నిరంకుశాః గాయకః అనదగిన వ్యక్తి. సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు, ప్లేబ్యాక్ పాటలు పాడాడు. నేటి ప్రయోగం రేపటి సంప్రదాయం కాగలదని ఆయన సిద్ధాంతం.శ్రీ రంగం శ్రీనివాసరావు

శ్రీ శ్రీ (1910 -1983) ని యుగకర్తగా చేసింది ఆయన " మహా ప్రస్థానం " గీతాలు. ఆయనతో తెలుగు కవిత్వ స్వభావం మారిపోయింది, దాని భాష మారిపోయింది. సాహిత్యం వినోదానికి, కాలక్షేపానికి కాదనీ, దానికి సామాజిక ప్రయోజనం ఉందనీ, జరుగుబాటులేని జనాన్ని తిరుగుబాటు చేయండని ప్రబోధించేదే కవిత అని, తాడిత, పీడిత జనం కన్నీరు తుడిచి వారి పక్షాన నిలబడేదే అసలైన కవిత్వమనీ ఆయన విశ్వాసం. .
" కవితా ! ఓ కవితా !"
అని వ్రాసిన గీతం ప్రపంచ సాహిత్యంలోనే అద్వితీయం !

ఓహో ! ఓ రసధుని ! మణిఖని ! జననీ !
ఓ కవితా ! కవితా ! కవితా ! ఓ కవితా !


పాలగుమ్మి పద్మరాజు

పాలగుమ్మి పద్మరాజు (1916 -1983) తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు.
" న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ " పత్రిక పోటీలో బహుమతి పొందిన " గాలివాన " లో రావుగారు తన చూట్టూ నైతిక విశ్వాసాల గోడలు కట్టుకున్న పాత్ర . ఒక గాలివానకు ఆ గోడలు పడి పోతాయి. తన నైతిక విశ్వాసాల కంటే ఒక బిచ్ఛగత్తెలోని ఆర్ద్రమైన మానవత్వం గొప్పదని రావుగారు గ్రహించడం ఆ కథలోని వస్తువు. పడవ ప్రయాణం మొదలైన అనేక కథలలో పద్మరాజు గారు మానవ మనస్తత్వంలోని అట్టడుగు చీకటి కోణాలపై తన నిశిత విశ్లేషణా కాంతి కిరణాలను ప్రసరింపచేస్తారు. పద్మరాజుగారు సినిమా రచయితగా ఎన్నో చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు.తుమ్మల సీతారామమూర్తి

తుమ్మల సీతారామమూర్తి (1901- ). తెలుగుదనంలో రాజీలేని రైతు బిడ్డ. తన తెలుగుదనాన్ని ఎలుగెత్తి చాటినవాడు. రాష్ట్రగానం, ఉదయగానం, మహాత్ముని ఆత్మకథ వంటి కృతుల ద్వారా అభినవ తిక్కనగా, తెలుగు లెంకగా పేరొందిన మనీషి.
దొమ్మేటి సూర్యనారాయణ

' రంగూన్ రౌడి పాత్రతో రౌడీలకు కనువిప్పు కలిగించిన మహానటుడు దొమ్మేటి సూర్యనారాయణ. రంగూన్లో తెలుగు నాటకాలను విస్తృతంగా ప్రదర్శించి రంగూన్ ఆంధ్రుల ఆదరణ పొందిన దొమ్మేటి చిత్రాలలో - ద్రౌపది వస్త్రాపహరణంలో భీముడు, ' కనకతార '
లో క్రూరసేనుడుగా నటించి వేమూరి గగ్గయ్యతో సమఉజ్జీగా నిలబడ్డారు.స్థానం నరసింహారావు

పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాలలో సత్యభామ, శకుంతల, చిత్రాంగి, మల్లామాంబ, దేవదేవి, చింతామణి, మోహిని, యశోద, ముర, మధురవాణి, రోషనార, అనసూయ, లీలావతి, మీరాబాయి, సంయుక్త, చంద్రమతి, దమయంతి మొదలైన స్త్రీ పాత్రలను రంగస్థలం మీద మహోన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళి 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహించిన తెలుగు నాటక రంగంలో తొలి పద్మశ్రీ గ్రహీత స్థానం నరసింహారావు. మూడువేల సార్లు రంగస్థలం మీద స్త్రీ పాత్రలను నటించిన తెనాలి జాతి
యడవల్లి సూర్య నారాయణ

గుంటూరులో 1888 లో జననం. హరిప్రసాదరావు వరవడిలో ఆయన అనంతరం ఆ పాత్రలలోనే నటించారు. - సావిత్రిలో సత్యవంతుడు, శకుంతలలో దుష్యంతుడు గయోపాఖ్యానంలో అర్జునుడు, చిత్రనళీయంలో నలుడు, బాహుకుడు, వేణీ సంహారం, ద్రౌపది వస్త్రాపహరణం, ' పాండవోద్యోగ విజయాలలో దుర్యోధనుడు, ' పాదుక ' లో శ్రీరాముడు, సారంగధరలో సారంగధరుడు ' పోషించిన సహజ నటనాధురీణుడు యడవల్లి సూర్య నారాయణ. పద్యాన్ని భావయుక్తంగా పాడేవారు. 1932 లో రెండవ తెలుగు చిత్రం ' పాదుకా పట్టాభిషేకం '
లో రాముడుగా, 1936 లో శకుంతలం ' చిత్రంలో దుష్యంతుడుగా నటించారు.
Yadavalli Surya Narayana